స్టాలిన్ కాంబినేషన్ రీపీట్ కాబోతుందా?

chiranjeevi,Trisha
x
chiranjeevi,Trisha
Highlights

తాజాగా సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగస్టార్ చిరంజీవి.. ఉయ్యాలవాడ పాత్రలో కనిపించి అందరిని మెప్పించారు. ఆ తర్వాత కొరటాల శివతో వెంటనే...

తాజాగా సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగస్టార్ చిరంజీవి.. ఉయ్యాలవాడ పాత్రలో కనిపించి అందరిని మెప్పించారు. ఆ తర్వాత కొరటాల శివతో వెంటనే సినిమాని స్టార్ట్ చేసారు మెగాస్టార్.. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.. కొణిదెల ప్రొడక్షన్ ,మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

అయితే మెగాస్టార్ 152 వ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారు కానీ త్రిషను హీరోయిన్ గా ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే త్రిషతో కథ చర్చలు కూడా జరిపారని,ఆమె కూడా సినిమాకి ఒప్పుకుందని సమాచారం..

త్రిష,చిరంజీవి కలిసి మురగదాస్ దర్శకత్వంలో స్టాలిన్ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో కూడా ఇదే కాంబినేషన్ సెట్ అవుతే తెరపైకి 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ ని చూడొచ్చు ప్రేక్షకులు.. ఈ సినిమా దేవాదాయశాఖాలో జరిగే అవినీతి చూట్టు నడుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories