సైరాలో మిస్ అయింది కొరటాల తీరుస్తాడా ?

సైరాలో మిస్ అయింది కొరటాల తీరుస్తాడా ?
x
Highlights

చిరంజీవి సినిమా వస్తుంది అంటే అభిమానులు అంచనా వేసేవి అయన డాన్స్, కామెడి, పవర్ ఫుల్ డైలాగ్స్... కానీ సైరాలో డైలాగ్స్ వరకు ఓకే కానీ... మిగతా రెండు...

చిరంజీవి సినిమా వస్తుంది అంటే అభిమానులు అంచనా వేసేవి అయన డాన్స్, కామెడి, పవర్ ఫుల్ డైలాగ్స్... కానీ సైరాలో డైలాగ్స్ వరకు ఓకే కానీ... మిగతా రెండు కుదరలేదు. దీనితో ఓపెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చాడు చిరు ... సెట్స్ లో మనస్ఫూర్తిగా నవ్వి దాదాపు రెండేళ్లు అయింది. సైరా విషయంలో అది కుదరలేదు. డాన్స్ కూడా లేదు. కానీ నా తరవాతి సినిమాలో ఇవన్ని ఉండేలా చూసుకుంటాను అని చిరంజీవి అన్నాడు.

సైరా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. చిరు కోసం కొరటాల ఓ సీరియస్ సబ్జెక్ట్ రాసుకున్నాడు .. దానిపై కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు సైరాలో చిరు మిస్ అయినవి కొరటాల ఎంతవరకు తీరుస్తాడు అన్నది మెయిన్ పాయింట్... కొరటాల సినిమాలో కావలసినంత డాన్స్, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కానీ ఎటొచ్చి కామెడి దగ్గరే డౌట్...

బేసిక్ గా కొరటాల సినిమాలో కామెడి ఉండదు. అది అయన గత సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. కథకి అడ్డం వస్తే సన్నివేశాన్ని కాదు. ఆర్టిస్ట్ నే మార్చేస్తాడు. ఇప్పుడు చిరు కోసం కామెడి పెట్టమంటే పెడతాడా ? అన్నది చూడాలి. ఇందులో చిరు కోరిక సగం తిరినట్టే.. ఇంక సగం కోరిక త్రివిక్రమ్ సినిమాలో తీరడం ఖాయం. ఎందుకంటే కామెడి క్రియేట్ చేయడంలో త్రివిక్రమ్ కి త్రివిక్రమే సాటి కదా .. !

Show Full Article
Print Article
More On
Next Story
More Stories