చిరంజీవి మాటలకి తెలుగు రాష్టాల సీఎంలు ఏమంటారు?

చిరంజీవి మాటలకి తెలుగు రాష్టాల సీఎంలు ఏమంటారు?
x
KCR, Jagan, chiranjeevi
Highlights

తెలుగు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంటుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఓ హీరో మరో హీరో ఆడియో వేడుకకి వెళ్లడం అనేది జరుగుతుంది. ఇది...

తెలుగు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంటుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఓ హీరో మరో హీరో ఆడియో వేడుకకి వెళ్లడం అనేది జరుగుతుంది. ఇది మంచి సంప్రదాయమనే చెప్పాలి. ఇక గత రాత్రి జరిగిన మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వెళ్లి సినిమాకి సపోర్ట్ చేశారు.

అయితే ఇదే వేడుకలో చిరంజీవి సీనియర్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడారు. కృష్ణకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తనకు అనిపిస్తోందని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని అయన వాఖ్యానించారు . హీరోగా ఆయన చేసిన ప్రయోగాలు మరెవరు చెయ్యలేదని అన్నారు.

అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆయనకు ఇప్పించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందని చెప్పుకొచ్చారు. మరి దీనిపైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి మరి..

ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయానికి వచ్చేసరికి అన్ని సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్దం అయింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. మొదటిసారిగా మహేష్ ఈ సినిమాలో ఆర్మీ లుక్ లో కనిపిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్నా కథానాయకగా నటించింది. విజయశాంతి, సంగీత, రాజేంద్రప్రసాద్ , రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు, అనిల్ సుంకర లతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, అల్లు అర్జున్ ఆల వైకుంఠపురములో , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories