Disco Raja: డిస్కోరాజా ఎందుకు చూడాలంటే?

Disco Raja: డిస్కోరాజా ఎందుకు చూడాలంటే?
x
disco raja
Highlights

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత సరైనా హిట్ కొట్టలేకపోయాడు హీరో రవితేజ.. ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత సరైనా హిట్ కొట్టలేకపోయాడు హీరో రవితేజ.. ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న రిలీజ్ చేస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అయితే ఈ సినిమాలోని ఏఏ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో ఇప్పుడు చూద్దాం. !

రవితేజ :

హీరో రవితేజ ఎనర్జీ గురించి ప్రధానంగా చెప్పాల్సిన పనిలేదు. అయన సినిమాలలో మంచి ఎనర్జీని కనబరుస్తూ ఉంటాడు రవితేజ.. కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాలలో రవితేజ నటన బాగుంటుంది. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మాస్ మహరాజ్‌ మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. అయితే ఇది ఒకే పాత్ర లేక డిఫిరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

విఐ ఆనంద్‌ :

ఒకే రకమైన మూస కథలు కాకుండా వైవిధ్యమైన చిత్రాలను తెరకేక్కిస్తుంటారు దర్శకుడు విఐ ఆనంద్‌.. అందులో భాగంగానే ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డిస్కోరాజా సినిమాని కూడా ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించాడు. సైన్స్‌ ఫిక్షన్‌ కాన్సెప్ట్‌తో పీరియాడిక్‌ జానర్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది.

ముగ్గురు హీరోయిన్స్ :

ఈ సినిమాలో రవితేజతో ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నారు. ఇస్మార్ట్ భామ నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోపే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రవితేజ కూడా మొదటిసారి ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటిస్తున్నాడు.

బాబీ సింహా :

తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని నటుడు కానీ విలక్షణమైన నటుడుగా ఆయనకి మంచి పేరుంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ పాత్రను పోషించింది ఆయనే.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.

తమన్ :

వరుస హిట్స్ తో మంచి దూకుడు మీదా ఉన్న తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకి అందించిన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇందులో " నువ్వు నాతో ఏం అన్నావో, ఢిల్లీ వాలా" పాటలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. సినిమా నేపధ్య సంగీతం కూడా బాగుండి సినిమాకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories