ఈసారి నంది అవార్డులు ఎవరికీ ?

ఈసారి నంది అవార్డులు ఎవరికీ ?
x
Highlights

ప్రతి ఏటా ఏపి ప్రభుత్వం నంది పురస్కారాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి...

ప్రతి ఏటా ఏపి ప్రభుత్వం నంది పురస్కారాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదిగా చివరగా 2011 లో ఏపి ప్రభుత్వం నంది పురస్కారాలని ఇచ్చింది .. అ తర్వాత రాష్ట్రం విడిపోయాక విభజిత నవ్యాంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చింది . 2012-13 రెండు సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులను ప్రకటించింది . 2012 లో నానికి ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది . 2013లో మిర్చి సినిమాకి గాను ప్రభాస్ కి నంది అవార్డు ఇచ్చారు .. అయితే అదే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సినిమా అయిన అత్తారింటికి దారేది సినిమాకి గాను పవన్ కళ్యాణ్ కి నంది అవార్డు ఇవ్వకపోవడంపై అయన ఫాన్స్ నానా హంగామా చేసారు ..

ఇక 2014,15,16 సంవత్సరంలో మళ్ళీ నంది అవార్డులను ప్రకటించారు ఏపి ప్రభుత్వం . 2014 బాలయ్యకి లెజెండ్ సినిమాకి గాను , 2015లో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకి గాను , 2016లో ఎన్టీఆర్ కి నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ సినిమాలకు గాను నంది అవార్డులను ప్రకటించారు . అయితే ఈ ముగ్గురు ఒకే సామజీక వర్గానికి చెందినా వారు కావడం మరియు టిడిపి పార్టీతో సఖ్యత కూడా ఉండడంతో కొంతవరకు చర్చ నడిచిందనే చెప్పాలి . దీనితో మళ్ళీ నంది అవార్డుల పురస్కారాన్ని వాయిదా వేసారు . అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చింది . మరి ఈ సారి పెండింగ్ లో ఉన్నా నంది అవార్డులను ఎవరికీ ప్రకటిస్తారు అన్నది చూడాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories