బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?

బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కోసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రీ-ఫైనల్ వీక్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 6 మంది సభ్యులు...

బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కోసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రీ-ఫైనల్ వీక్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 6 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఈ వీక్ లో ఇంటి నుండి బయటకు వస్తారు. ఇందులో రాహుల్ ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే..ఇక మిగిలిన అయిదుగురు వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, శివజ్యోతి, అలీరెజా మాత్రమే .. వీరందరూ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు.

ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది బిగ్ బాస్ అభిమానులందరికీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో అలీరెజా మరియు శివజ్యోతి ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ మళ్ళీ ఇందులో అలీ రెజా బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో అతడిని బిగ్ బాస్ విన్నర్ ని చేసేందుకు అతని భార్య మసుమా బాగానే ప్రచారం చేస్తుందని టాక్ .

కాబట్టి ఈ వారం అతన్ని ఇంటినుండి ఎలిమినేషన్ నుండి తప్పించేందుకు ఇది ఉపయోగపడవచ్చు. ఇక శివ జ్యోతి ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే బిగ్ బాస్ లో ఎప్పుడు , ఏదైనా జరగవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి దీనిపైన స్పష్టత రావాలంటే మనం రేపటి వరకు ఆగక తప్పదు అన్నమాట ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories