'రమణ లోడ్ ఎత్తాలిరా ' అని డైలాగ్ చెప్పిన నటుడు ఎవరో తెలుసా?

రమణ లోడ్ ఎత్తాలిరా  అని డైలాగ్ చెప్పిన నటుడు ఎవరో తెలుసా?
x
Highlights

ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లోకి అవకాశాల కోసం వచ్చేవారికి సినిమాలో ఎలా అయిన గుర్తింపు రావచ్చు.

ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లోకి అవకాశాల కోసం వచ్చేవారికి సినిమాలో ఎలా అయిన గుర్తింపు రావచ్చు. కొందరు పాత్రల ద్వారా ఫేమస్ అవుతే మరికొందరు డైలాగ్స్ వల్ల ఫేమస్ అవుతారు. రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం ద్వారా అలీ ఏందా చాట అనే ఒకే ఒక డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఇక ఇలా చెప్పుకుంటే పోతే చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అలంటి జాబితాలోకి కుమనన్ సేతురామన్ కూడా చేరిపోయారు.

కుమనన్ సేతురామన్ ఎవరో కాదు మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది'అంటూ డైలాగ్ చెప్పాడు చూసారా అతనే.. ఈ ఒక్క డైలాగ్ చెప్పి క్రెడిట్ మొత్తం మీరే కొట్టేసారు అని మహేష్ బాబే స్వయంగా చెప్పాడంటే అర్ధం చేసుకోవచ్చు ఆ డైలాగ్ ఎంతో ఫేమస్ అయిందో.. అయితే అతను ఎవరు, ఇంతకు ముందు ఏదైనా సినిమాల్లో నటించాడా అని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు.

ఇప్పుడు అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


♦ కుమనన్ సేతురామన్ సినిమాల్లోకి రాకముందు సర్వీస్‌ ఇంజినీర్‌గా ఓ కంపెనీలో పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాలపైన మక్కువతో 1984 వ సంవత్సరంలో చెన్నై నుంచి వైజాగ్ కి వచ్చారు. ఫోటోగ్రఫీ మీదా ఉన్న ఇష్టంతో సినిమాల్లో ఫోటోగ్రాఫర్ గా కొనసాగాలని అనుకున్నారు. మేఘం అనే సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టారు.


♦ ఆ తర్వాత నటుడుగా మారి వెంకీ, దైర్యం, స్టాలిన్, అల్లుడు శీను చిత్రాలలో నటించాడు.

♦ ఇక అరవింద్ 2 సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.

♦ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా సేతురామన్‌ పనిచేశారు.


♦ ఇక గత ఏడాది చిరంజీవి నటించిన సైరా సినిమాలో బోయవాళ్ళకి పెద్దగా పనిచేశారు.

♦ ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతా' అంటూ చెప్పిన డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు.


♦ గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వచ్చిన సేతురామన్ చాలా చిత్రాలలో నటించినప్పటికీ అప్పుడు రాని గుర్తింపు ఈ సినిమాలో ఒక్క డైలాగ్ తో రావడం చాలా ఆనందగా ఉందని వరంగల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.కష్టపడితే ఫలితం ఎప్పటికైనా వస్తుంది అని చెప్పడానికి కుమనన్ సేతురామన్ జీవితం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories