వాల్మికిలో ఇతను ఎవరబ్బా ..?

వాల్మికిలో ఇతను ఎవరబ్బా ..?
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి .. ఈ సినిమా తమిళ్ సినిమా జిగార్తండకి రీమేక్... పేరుకే ఈ సినిమా రీమేక్...

డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి .. ఈ సినిమా తమిళ్ సినిమా జిగార్తండకి రీమేక్... పేరుకే ఈ సినిమా రీమేక్ కానీ చాలా వరకు మార్పులు కనిపిస్తున్నాయి .. నిన్న ఈ సినిమాకి సంబంధించిన టిజర్ విడుదల చేసింది చిత్రబృందం .. ఇందులో వరుణ్ తేజ్ లుక్ ఐతే మాములుగా లేదు .. ఊర మాస్ లుక్ లో వరుణ్ భలే సెట్ అయ్యాడు.. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న పాత్ర ఒరిజినల్ లో బాబీ సింహ చేసాడు ..

ఒరిజినల్ లో బాబీ సింహా మాత్రమే కాకుండా సిద్దార్థ పాత్ర కూడా ఉంటుంది.. ఇక్కడ అ పాత్రను తమిళ్ హీరో అధర్వ నటిస్తున్నాడు .. చిత్ర యూనిట్ విడుదల చేసిన లుక్ లో అతను కూడా ఉన్నాడు.. దీనితో ఇతను ఎవరబ్బా అని ప్రేక్షకులు అయన గురించి వెతకడం మొదలు పెట్టారు .. ఇంతకి ఈ అధర్వ ఎవరంటే.. ప్రముఖ సీనియర్ హీరో మురళి రెండో అబ్బాయి...

అప్పట్లో హృదయం లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తో మనకూ బాగా దగ్గరయ్యాడు. అధర్వ తాతయ్య సిద్ధలింగయ్య సుప్రసిద్ధ కన్నడ నిర్మాత. ఈ సినిమాలో అతను ఫిలిం మేకర్ గా కనిపించనున్నాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories