2019లో తెలుగు సినీ ఇండస్ట్రీని వీడిన ప్రముఖులు

2019లో తెలుగు సినీ ఇండస్ట్రీని వీడిన ప్రముఖులు
x
Highlights

తెలుగు చిత్ర పరిశ్రమలో వారి స్థానం అమోఘం.. ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో వారి స్థానం అమోఘం.. ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కానీ అదే ప్రేక్షకులను ఏడిపిస్తూ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. అలా 2019 లో మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయిన కొంద‌రు సినిమా ప్రముఖుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. విజయ బాపినీడు

మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ హిట్లను అందించిన దర్శకుడు విజయ బాపినీడు..చిరంజీవి తర్వాత అయన రాజేంద్ర ప్రసాద్‌తో ఎక్కువ సినిమాలు తీశారు. గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు,వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు చేశారు. అయన ఫిబ్రవరి 12, 2019లో తుది శ్వాస విడిచారు.

2. కోడి రామకృష్ణ

ఇంట్లో రామయ్య విదిల్లో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కోడి రామకృష్ణ..100కి పైగా సినిమాలు తీసినా దర్శకులలో ఒకరిగా నిలిచారు కోడి రామకృష్ణ..అయన ఫిబ్రవరి 22, 2019న తుది శ్వాస విడిచారు. దాసరి నారాయణరావు ఆయనకి గురువు. ఫాంటసీ సినిమాలు చేయడంలో కోడి రామకృష్ణ పెట్టింది పేరు. అమ్మోరు,దేవి, అంజీ, అరుంధతి చిత్రాలకి గాను మంచి పేరు వచ్చింది.

3. రాళ్ళపల్లి నరసింహారావు

రంగస్థల నటుడు నుంచి వెండితెరకు పరిచయం అయ్యారు రాళ్లపల్లి నరసింహారావు. 1973లో 'స్త్రీ' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.దాదాపుగా 850 చిత్రాలలో నటించారు. దర్శకులు జంధ్యాల, వంశీ సినిమాలలో రాళ్లపల్లికి ప్రత్యేకంగా ఓ పాత్ర ఉండేది. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని మెడీక్యార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 మే 17న మరణించారు.

4. విజయ నిర్మల

పాండురంగ మహత్యం సినిమాలో బాలనటిగా పరిచయం అయిన విజయ నిర్మల ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్‌లో ఎక్కారు. దర్శకురాలుగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2019 జూన్ 27 అనారోగ్యంతో భాదపడుతూ మరణించారు.

5. వేణు మాదవ్

మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. హస్యనటుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్రవేశారు. సెప్టెంబరు 25 2019న అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో కన్నుమూశారు వేణుమాధవ్.

6. గీతాంజలి

సీనియర్‌ నటిగా చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు గీతాంజలి.. తెలుగు, తమిళ భాషలలో ఎక్కువగా సినిమాలు చేశారు గీతాంజలీ.అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ 2019 అక్టోబర్31 గుండెపోటుతో చనిపోయారు. సహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరింది.

7. మారుతి రావు గొల్లపూడి

రచయితగా నటుడుగా మెప్పించారు గొల్లపూడి. దాదాపుగా 250 కి పైగా చిత్రాలలో నటించారాయన. విలన్ గా, సహాయ నటుడిగా, కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి విలక్షణనటుడిగా చెరగని ముద్ర వేశారు. వెండితెర మీదా మాత్రమే కాదు. పత్రికా రంగంలోను గొల్లపూడి కృషి అమోఘం అని చెప్పాలి. అయన అనారోగ్యంతో భాదపడుతూ డిసెంబర్ 12 2019న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories