కళ్యాణ్ రామ్ సంక్రాంతి బరిలోనే ఉన్నాడా?

కళ్యాణ్ రామ్ సంక్రాంతి బరిలోనే ఉన్నాడా?
x
Kalyan Ram
Highlights

సంక్రాంతికి వచ్చే సినిమాలపైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి. సినిమా ఎ మాత్రం బాగున్నా సరే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.

సంక్రాంతికి వచ్చే సినిమాలపైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి. సినిమా ఎ మాత్రం బాగున్నా సరే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.. ఇప్పుడు ఏకంగా సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంములో, రజినీకాంత్ దర్బార్ లాంటి సినిమాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంత మంచివాడవురా అనే సినిమా ఒకటి..

స్టార్ హీరోల సినిమాల మద్యలో కళ్యాణ్ రామ్ సినిమాని రిలీజ్ చేయడం చాల రిస్క్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ పక్కా ఫ్యామిలీ కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాని పక్కా సంక్రాంతికి రిలీజ్ చేయడం కరెక్ట్.. ఎందుకంటే పండగ సీజన్ కి కుటుంబంమంతా కలిసి ఓ కుటుంబ కథ చిత్రాన్ని చూసేందుకు ఇష్టపడతారు కాబట్టి. అయితే స్టార్ హీరోల మధ్య సినిమా వస్తుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగా ఉండాలి కదా మరి,..

ఇప్పటివరకు సినిమా నుండి కళ్యాణ్ రామ్ లుక్, సినిమా టిజర్ తప్ప మరేమీ విడుదల చేయలేదు. ఒక పక్కా మహేష్, అల్లు అర్జున్ తమతమ సినిమా అప్డేట్ లను వారానికి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ బాగా వెనకబడిపోయాడు. ఇంతకి సంక్రాంతి రేస్ లో కళ్యాణ్ రామ్ ఉన్నాడా లేదా అన్న అనుమానం కలుగుతుంది కూడా..

చిత్రీకరణకి చివరి దశలో ఉన్న ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం కాబోతుందట.. సినిమాలోని పాటలను వారానికొకటి రిలీజ్ చేయాలనీ భావిస్తుందట.. ఇక చిత్ర ట్రైలర్ ని హ్యాపీ న్యూ ఇయర్ సందర్బంగా జనవరి 1 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉందట..

మేహరీన్ కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రానికి శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ దర్శకత్వం వహిస్తున్నాడు. సుహాసిని మెయిన్ రోల్ లో నటిస్తుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories