బిగ్ బాస్ 3 ఎపుడు ప్రారంభం అవుతుందో..?

బిగ్ బాస్ 3 ఎపుడు ప్రారంభం అవుతుందో..?
x
Highlights

బిగ్ బాస్.. ప్రపంచ రియాల్టీ షోలలో సంచలనం. ఈ సంచలనాన్ని తెలుగులోనూ ప్రసారం చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే రెండు సేజన్ లు పూర్తయ్యాయి. బిగ్ బాస్ 1...

బిగ్ బాస్.. ప్రపంచ రియాల్టీ షోలలో సంచలనం. ఈ సంచలనాన్ని తెలుగులోనూ ప్రసారం చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే రెండు సేజన్ లు పూర్తయ్యాయి. బిగ్ బాస్ 1 హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆ సీజన్ ను తన సహజసిద్ధమైన పద్ధతిలో నడిపించి ఒక రేంజ్ లో నిలబెట్టారు. అయితే, తరువాత వచ్చిన రెండో సీజన్ హిట్ అయినా.. మొదటి సీజన్ అంత ఆకట్టుకోలేదన్నది నిజం. నేచురల్ స్టార్ నానీ హోస్ట్ గా రూపుదిద్దుకున్న ఈ సీజన్ ప్రేక్షకులకు అంతగా పట్టలేడనే చెప్పాలి. కౌశల్ ఎపిసోడ్స్ విషయంలో నానీ సరిగా మేనేజ్ చేయలేకపోయాడనే విమర్శలు వచ్చాయి.

ఇపుడు మూడో సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, మూడో సీజన్ కు వ్యాఖ్యాత ఎవరనే విషయం లో ఇప్పటికీ స్పష్టత లేదు. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినా.. అవి ఏవీ అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా రానున్నారని బాగా ప్రచారం జరిగింది. కానీ, ఇది కూడా ఇంకా స్పష్టంగా తేలలేదు.

ఇక, బిగ్ బాస్ తమిళ వెర్షన్ జూలై లో ప్రారంభం కానుంది. దానికి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. కనీ, తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా సెట్ కాలేదు. అయితే, మా టీవీ యాజమాన్యం మాత్రం కచ్చితంగా అన్ని భాషల్లో ప్రారంభం అయినట్టు గానే.. తెలుగు లో కూడా జూలై నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories