Bheeshma: 'వాటే బ్యూటి' వీడియో ప్రోమో వచ్చేసింది!

Bheeshma: వాటే బ్యూటి వీడియో ప్రోమో వచ్చేసింది!
x
Highlights

యంగ్ హీరో నితిన్ కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'.. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలను కలగజేశాయి.

యంగ్ హీరో నితిన్ కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'.. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలను కలగజేశాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన 'వాటే బ్యూటి' సాంగ్ వీడియో ప్రోమోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో ప్రోమోలో నితిన్, రష్మిక జంట బాగుంది. అంతేకాకుండా డాన్స్ పరంగా నితిన్ కి ఎక్కడ కూడా తగ్గకుండా రష్మిక మందన్నా కూడా ఆదరగోట్టింది. జాని మాస్టర్ ఈ పాటని కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ని అందించాడు.

ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫై నాగ వంశీ నిర్మిస్తుండగా మణిశర్మ కుమారుడు మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.సంపత్, బ్రహ్మాజీ, వెన్నల కిషోర్, రఘుబాబు, నరేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రొమాటింక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాతో పాటు విభిన్నమైన కథలు తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలో విడుదల చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories