we want prabhas20 update : ట్విట్టర్ లో ట్రేండింగ్

prabhas
x
prabhas
Highlights

చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మా అభిమాన హీరో సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గత చిత్రం సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఆ తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది ప్రభాస్ కి 20 వ సినిమా.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రకరించేందుకు అనుకున్న టైం ప్రకారం సెట్ రెడీ కాకపోవడంతో షూటింగ్ వాయుదా పడినట్లు వార్తలు వచ్చాయి.

కానీ దీనిపైన చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మా అభిమాన హీరో సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. we want prabhas 20 update అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ యువీ క్రియేషన్స్ కి ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఏకంగా ఈ హాష్ ట్యాగ్ తో రెండు లక్షల మంది ట్వీట్ చేయడం విశేషం.. మరి అభిమానుల కోరిక మేరకు అయిన చిత్ర యూనిట్ సినిమాపైన ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.. ఇక ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని పరిశలనలో ఉంచినట్టు సమాచారం..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories