సంక్రాంతి బరిలో మూడు పుంజులు...నెగ్గేదేవరు ?

సంక్రాంతి బరిలో మూడు పుంజులు...నెగ్గేదేవరు ?
x
Highlights

పండగలకి విడుదలయ్యే సినిమాలకి మంచి గిరాకి ఉంటుంది. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే.. ఫాన్స్, ఫ్యామిలీస్ సినిమాని చూసేందుకు ఇష్టపడుతారు. సినిమాకి మంచి...

పండగలకి విడుదలయ్యే సినిమాలకి మంచి గిరాకి ఉంటుంది. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే.. ఫాన్స్, ఫ్యామిలీస్ సినిమాని చూసేందుకు ఇష్టపడుతారు. సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వస్తాయి. అయితే ఈ సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నికేవ్వురు.. అల్లు అర్జున్ అల వైకుంటపురం అనే సినిమాలు బరిలో ఉన్నాయి. వీటికి తోడు కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అనే సినిమా కూడా బరిలో ఉంది. మరి ఇందులో ఎవరు హిట్టు కొడతారు. ఎవరిదీ పై చేయి సాధిస్తారు అన్న చర్చ ఇప్పటినుంచే మొదలైంది.

f2 లాంటి భారీ హిట్టు తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అందులోను విజయశాంతి రీఎంట్రీ ఉండడంతో సినిమా బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంటపురంలో అనే సినిమా తెరక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్టర్స్, సామజవరగమనా పాట సినిమాకి ఎక్కడలేని క్రేజ్ ని తీసుకువచ్చాయి. ఇలా రెండు భారీ సినిమాల మధ్యలో కళ్యాణ్ రామ్ కూడా సై అని బరిలో దిగబోతున్నాడు.

మంచి ఫ్యామిలీ దర్శకుడుగా సతీష్ విగ్నేశకి పేరుంది, అయన దర్శకత్వం వహించిన శతమానం భవతి సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. మళ్ళీ మంచి ఫ్యామిలీ కథతోనే కళ్యాణ్ రామ్ తో బరిలోకి దిగబోతున్నాడు ఈ దర్శకుడు. సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా హిట్టు కొట్టడం ఖాయమనే చెప్పాలి. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు నేగ్గుతారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories