మోడీ బయోపిక్ కు రంగం సిద్ధం.. మోడీ పాత్రధారి ఎవరంటే..?

మోడీ బయోపిక్ కు రంగం సిద్ధం.. మోడీ పాత్రధారి ఎవరంటే..?
x
Highlights

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ ఇలా ఏ రంగంలో చూసిన బయోపిక్‌ల జోరే నడుస్తోంది. ప్రేక్షకులు కూడా బయోపిక్‌లపై మక్కువ చూపడంతో దర్శకనిర్మాతలు కూడా బయోపిక్ పైనే లుక్ వేశారు. ఇక తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ జీవిత చరిత్రపై సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్‌లో సన్నహాలకు రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ ఇలా ఏ రంగంలో చూసిన బయోపిక్‌ల జోరే నడుస్తోంది. ప్రేక్షకులు కూడా బయోపిక్‌లపై మక్కువ చూపడంతో దర్శకనిర్మాతలు కూడా బయోపిక్ పైనే లుక్ వేశారు. ఇక తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ జీవిత చరిత్రపై సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్‌లో సన్నహాలకు రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహింస్తున్నాడు. మోడీ బయోపిక్‌కు సంబంధించి కథ, స్ర్కీన్ ప్లే తదితర అంశాలపై ఒమంగ్ బృందం భారీగానే పనిచేస్తున్నారట. ఇక అతిత్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ బయోపిక్‌లో మోడీ ప్రాత్రను పోషించేందుకు ప్రముఖ నటుడు వివేక్ బబెరాయ్‌ను సంప్రదించినట్లు సమాచారం. వివేక్ బబెరాయ్ కీలక పాత్రను పోషిస్తే దక్షిణాదిన కూడా మంచి పాపులారిటీ వస్తుందని చిత్రబృందం భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories