చిరు, కొరటాల సినిమాలో విజయశాంతి?

చిరు, కొరటాల సినిమాలో విజయశాంతి?
x
Highlights

లేడి అమితాబ్ గా తెలుగు తెర పై పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మొఖానికి మేకప్...

లేడి అమితాబ్ గా తెలుగు తెర పై పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మొఖానికి మేకప్ వేసుకొని ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నారు విజయశాంతి. ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నికేవ్వరు సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె కొరటాల శివ సినిమాలో నటించనున్నారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కొరటాల విజయశాంతిని సంప్రదించారట. అయితే ఆ పాత్ర చేయడానికి విజయశాంతి కూడా సుముఖత వ్యక్తం చేసారని టాక్ నడుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం చిరు సైరా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. సినిమాని అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories