విజయశాంతి రీఎంట్రీ ఆ సినిమాతో ఉండాల్సింది కానీ!

విజయశాంతి రీఎంట్రీ ఆ సినిమాతో ఉండాల్సింది కానీ!
x
Highlights

గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడి ఓరియెంటడ్ సినిమాలో నటించి ద లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరును సంపాదించుకుంది విజయశాంతి.

గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా లేడి ఓరియెంటడ్ సినిమాలో నటించి ద లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరును సంపాదించుకుంది విజయశాంతి.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషాలలో దాదాపుగా 180 సినిమాలకు పైగా నటించింది విజయశాంతి. చివరగా ఆమె నాయుడమ్మ సినిమాలో నటించింది. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళింది.

ఇక 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో భారతి అనే ప్రొఫెసర్ రోల్ లో ఆమె కనిపించనుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో ఆమె లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నట్టుగా అదే గ్లామరు, అదే పొగరు, అదే ఫిగరు, అదే అందం, అదే సొగసు గానే కనిపిస్తుంది విజయశాంతి.

అయితే విజయశాంతి ఈ సినిమా కంటే ముందే మరో సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వాల్సి ఉందట కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదట! ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయశాంతినే స్వయంగా చెప్పుకొచ్చింది. రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అమ్మ పాత్రకు ముందుగా విజయశాంతిని అనుకున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

కానీ అప్పటికి రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన చేయలేను అని చెప్పాను. మళ్ళీ సరిలేరు నీకెవ్వరు సినిమా స్టొరీతో వచ్చి ఇది మీరీ చేయలని పట్టుబట్టాడు . ముందుగా కథని చెప్పమని అడిగాను. కథలో అన్ని బాగుండడంతో చేసానని చెప్పుకొచ్చింది విజయశాంతి. ఇక ఆ సినిమాలో విజయశాంతి పోషించాల్సిన పాత్రను రాధిక చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా విషయానికి వచ్చేసరికి మహేష్ బాబు ఈ సినిమాలో ఆర్మీ రోల్ లో కనిపించనున్నాడు. సంగీత, ప్రకాష్ రాజ్ , రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఇందులో ఏది సంక్రాంతి సినిమా అనిపించుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories