విజయ్ సేతుపతి 'పుష్ప' సినిమాను వదులుకున్నారా?

విజయ్ సేతుపతి పుష్ప సినిమాను వదులుకున్నారా?
x
Vijay sethupathi (file photo)
Highlights

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం.. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. విజయ్ సేతుపతి తమిళ్ లో ఎంత బిజీ యాక్టర్ అన్నది అందరికీ తెలిసిందే. డేట్లు సర్దుబాటు కాకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్లు కరోనాతో కొట్టుకుపోయాయని సమాచారం.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి స్థానంలో మరో తమిళ నటుడు తీసుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ రావాలంటే మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే...

ఇక సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories