విలన్ గా నాలుగు సినిమాలు చేయబోతున్న స్టార్ హీరో

విలన్ గా నాలుగు సినిమాలు చేయబోతున్న స్టార్ హీరో
x
Vijay Sethupathi
Highlights

హీరోలు, విలన్ లు గా ,విలన్ లు హీరోలు గా మారడం అనేది కొత్తేమి కాదు.. ఇప్పటికి చాలా మంది అలా మారి సక్సెస్ అయిన వారే..

హీరోలు, విలన్ లు గా ,విలన్ లు హీరోలు గా మారడం అనేది కొత్తేమి కాదు.. ఇప్పటికి చాలా మంది అలా మారి సక్సెస్ అయిన వారే.. నటుడిగా అన్ని పాత్రలను పోషించినప్పుడే పరిపూర్ణమైన నటుడుగా పేరు అవిష్కరించాబడతాము అన్నది వారి ధీమా. ఇప్పుడు ఇదే కోవాలోకి చేరాడు తమిళ నటుడు విజ‌య్ సేతుప‌తి .. త‌మిళ ప్రేక్షకుల‌తో మ‌క్కల్ సెల్వన్‌గా పిలిపించుకునే విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు పరభాష సినిమాలో కూడా నటించి అభిమానుల ప్రేమను దోచుకుంటున్నాడు.

తాజాగా విజ‌య్ సేతుప‌తి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంలో నటించి ఆకట్టుకున్నాడు. ఇందులో అయన రాజా పాండి పాత్రలో నటించి మెప్పించాడు విజ‌య్ . అయితే ఇప్పుడు అయన హీరో నుండి విలన్ గా మారబోతున్నారు. ఏకంగా నాలుగు సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట విజ‌య్ సేతుప‌తి..

విజ‌య్ తన 64 వ చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌...ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. ఇక క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన భార‌తీయుడు 2 లోను విల‌న్‌గా న‌టించేందుకు ముందుకొచ్చాడ‌ట‌ విజ‌య్ సేతుప‌తి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలో కూడా విజయ్ విలన్ గానే నటిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను విజయ్ చేయనున్నారని తెలుస్తుంది. దీనిపైన ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories