విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్‌..

విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్‌..
x
విజయ్‌ దేవరకొండ
Highlights

తెలుగు సినీ పరిశ్రమలో యూత ఐకాన్ గా నిలిచిన హీరో విజయ్‌ దేవరకొండ. సినిమాల్లో రానించాలంటూ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు విజయ్.

తెలుగు సినీ పరిశ్రమలో యూత ఐకాన్ గా నిలిచిన హీరో విజయ్‌ దేవరకొండ. సినిమాల్లో రానించాలంటూ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు విజయ్. అనుకున్నట్టుగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఎక్కువగా ఇతని సినిమాలకి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. యువతను ఆకట్టుకునే విధంగా ఉండే విజయ్ మూవీస్ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటాయి. ఇదే కోణంలో విజయ్ ఒక్క హిట్‌తోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడు ప్రేక్షకులనే కాదు, బాలీవుడ్ జనాలను కూడా తనవైపు తిప్పుకున్నాడు.

విజయ్ నటించిన నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాల్లో తనదైన శైలిలో నటించాడు. అందరి మదిని ఆకట్టుకున్న ఈ రౌడీ, ఒక్కో సినిమాతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లలో నిమగ్నమై బిజీగా ఉన్న రౌడీకి మరో అద్భుతమైన గౌరవం దక్కింది.అయితే పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది.

దీంతో గూగుల్ ట్రెండ్స్ 2019లో అత్యధిక మంది గూగుల్ సెర్చ్‌ చేసిన తారల జాబితాలను రిలీజ్ చేసింది‌. ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, వినూత్న రీతిలో తన నటనని చూపించే విజయ్, ఈ లిస్ట్‌లో సౌత్‌ ఇండియాలో టాప్‌ స్టార్‌గా అవతరించాడు. 2019లో డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షులని ఆకట్టుకోలేకపోయినా క్రేజ్‌ను మాత్రం సంపాదించుకుంది. అంతే కాదు విజయ్ దేవరకొండ చేసే లైవ్ షోలు, తన ఆటిడ్యూడ్ యూత్ ను ఆకట్టుకుంటాయి. దీంతో చాలా మంది 2019లో గూగుల్‌లో విజయ్ దేవరకొండ గురించి సర్చ్ చేసారు. దీంతో అతను ఈ జాబితాలో సౌత్‌లో సినీ హీరోల్లోనే టాప్‌లో నిలిచాడు. రజనీకాంత్, అజిత్‌, విజయ్‌, ప్రభాస్‌ లాంటి టాప్‌ స్టార్‌లను కాదని నెటిజెన్లు విజయ్‌ గురించి సెర్చ్‌ చేసేందుకు పోటి పడ్డారు.

అయితే క్రేజీ బాయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పేరుతో రానున్నాడు. ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు. లవ్, రొమాంటిక్, అఫెక్షన్ అన్ని కలగలుపుకుని ఉన్న ఈ సినిమా 2020 ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటు ఈ సినిమాని పూర్తి చేయకముందే మరో రెండు సినిమాలను కూడా తన ఖతాలో జమచేసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫైటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో కూడా హీరో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories