వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్: మరో అర్జున్ రెడ్డి లాగే ఉందే!

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్: మరో అర్జున్ రెడ్డి లాగే  ఉందే!
x
Highlights

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరియర్ ని మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరియర్ ని మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఇక గీతా గోవిందం సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ మూడు సినిమాలు విజయ్ రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఆ తర్వాత విజయ్ నుంచి ఈ రేంజ్ సినిమాలు అయితే రాలేదనే చెప్పాలి. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ల జోరును పెంచేసింది. అందులో భాగంగానే ఇప్పటికే నలుగురు హీరోయిన్స్ (రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా)తో ఉన్న రిలేషన్స్ ని చూపిస్తూ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు.

ఇప్పుడు సినిమాకి సంబందించిన టీజర్ ని కూడా బయటకు వదిలారు. ట్రైలర్ లో ఎక్కువ భాగం అర్జున్ రెడ్డి సినిమాని ఎక్కువగా తలపిస్తుంది. ప్రేమలో ఓడిపోయినా ప్రేమికుడిగా నటిస్తునట్టు కనిపిస్తుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ రాశీ ఖన్నా చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. మొదలైన ఈ టీజర్‌లో చాలా సార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజయ్. ఈ సినిమాలో రాశీ ఖన్నాతో లిప్ లాక్ సీన్స్ కూడా చేసాడు విజయ్ దేవరకొండ.

ట్రైలర్ చూసాక ఈ సినిమాకి వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని సగటు ప్రేక్షకుడికి అనిపించక మానదు. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఈ సినిమాని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. గోపి సుందర్ సంగీతం అందిచాడు. సినేమపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ పూరి డైరెక్షన్ లో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారానే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇందులో విజయ్ ఓ బాక్సర్ గా కనిపించనున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories