Top
logo

3 రోజులకే డల్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్

3 రోజులకే డల్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్
Highlights

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ వాలెంటైన్స్ డే సందర్బంగా గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాకి మొదటి అట నుంచే డివైడ్ టాక్ ని సంపాదించుకుంది. కానీ విజయ్ , ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక సరిగ్గా 3 రోజులు తిరిగేసరికి ఫ్లాప్ అయిపోయింది

మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఈ చిత్రానికి విడుదలకి ముందు 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యేసరికి 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ నటించిన ఫ్లాప్ సినిమా నోటా కంటే తక్కువగా ఈ సినిమాకు యూఎస్ లో వసూళ్లు వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి మళ్ళీ హిట్ బాట పడ్డ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచానాలు ఉన్నాయి. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Web Titlevijay devarakonda world famous lover collections down
Next Story


లైవ్ టీవి