Vijay Devarakonda: 'వరల్డ్ ఫేమస్ లవర్' క్లోజింగ్ కలెక్షన్స్.. సినిమాకి ఎంత నష్టం అంటే?

Vijay Devarakonda: వరల్డ్ ఫేమస్ లవర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సినిమాకి ఎంత నష్టం అంటే?
x
world famous lover closing collections
Highlights

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ వాలెంటైన్స్ డే సందర్బంగా

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా నటించారు. ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాకి మొదటి అట నుంచే డివైడ్ టాక్ ని సంపాదించుకుంది.

కానీ విజయ్ , ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక వీకెండ్ వరకూ కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపించినా ఈ సినిమా ఆ తర్వాత పూర్తిగా పడిపోయింది. దాదాపుగా ఈ సినిమాకి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.. ఇక సినిమా మొత్తం కేవలం 10.01 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . దీంతో 20 కోట్ల వరకూ ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాల్నే మిగిల్చినట్టుగా సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ కి బ్యాక్ టు బ్యాక్ గా ప్లాప్స్ పడ్డాయి.

నైజాం 4.15 cr

సీడెడ్ 0.76 cr

ఉత్తరాంధ్ర 0.86 cr

ఈస్ట్ 0.54 cr

వెస్ట్ 0.45 cr

కృష్ణా 0.51 cr

గుంటూరు 0.74 cr

నెల్లూరు 0.32 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr

ఓవర్సీస్ 0.98 cr

వరల్డ్ వైడ్ టోటల్ 10.01 cr (share)

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి మళ్ళీ హిట్ బాట పడ్డ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచానాలు ఉన్నాయి. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories