మహేశ్, బన్నిలను దాటేసిన విజయ్

మహేశ్, బన్నిలను దాటేసిన విజయ్
x
vijay devarakonda
Highlights

విజయ్ దేవరకొండ. సరిగ్గా మూడే మూడు సినిమాలు స్టార్ ని చేశాయి. యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించాయి పెట్టాయి.

విజయ్ దేవరకొండ. సరిగ్గా మూడే మూడు సినిమాలు స్టార్ ని చేశాయి. యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించాయి పెట్టాయి. పెళ్లి చూపులు సినిమాతో కెరియర్ ని ప్రారంభించిన విజయ్ మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విజయ్ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు విజయ్...

ఇందులో విజయ్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసినప్పటికీ అక్కడివాళ్లు మాత్రం అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో డబ్ చేసుకొని మరి చూసారంటే మనోడి క్రేజ్ ఏంటో పెద్దగా చెప్పనక్కరలేదు. ఇక గీతా గోవిందం తర్వాత చేసిన నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపొయిన విజయ్ క్రేజ్ మాత్రం ఎం తగ్గలేదు.

ఇన్ స్టాగ్ర‌మ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల‌కు వెనుకకి నేట్టేస్తున్నాడు. ఇన్ స్టాగ్ర‌మ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫాలోయింగ్ ఐదు మిలియ‌న్ల స్థాయికి చేరింది. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మ‌హేశ్ బాబుకు కూడా నాలుగు మిలియ‌న్ల స్థాయిలో ఉండగా, అల్లు అర్జున్ కు నల‌భై ఎనిమిది ల‌క్ష‌ల స్థాయి ఫాలోయ‌ర్లు ఉన్నారు. ఇప్పుడు వీరిని క్రాస్ చేసి విజ‌య్ ఐదు మిలియ‌న్ల స్థాయికి చేరాడు!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో " వరల్డ్ ఫేమస్ లవర్ " అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోయిన్స్ ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే నలుగురు హీరోయిన్స్ తో విజయ్ కి ఉన్న రిలేషన్ ఏంటి అన్న ఆసక్తిని కలిగిస్తూ పోస్టర్స్ ని విడుదల చేసింది. కేయస్ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సినిమాని విడుదల చేయనున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories