విజయ్ ఫ్యాన్స్ కల నెరవేర్చిన పూరి.. కొత్త సినిమా ప్రారంభం

విజయ్ ఫ్యాన్స్ కల నెరవేర్చిన పూరి.. కొత్త సినిమా ప్రారంభం
x
Highlights

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ముంబైలో మొదలైంది.

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ముంబైలో మొదలైంది. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా చేతులు కలపనున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

పక్కా మాస్ కమర్షియల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నా డు. అందుకే ఈ సినిమాకి టైటిల్ గా 'ఫైటర్ 'ని పరిశీలనలో ఉంచారు. ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోందని సమాచారం. ఇప్పటికే జాన్వీ కపూర్ కి పూరి కథ వినిపించాడని ఆమె కూడా చేసేందుకు ఆసక్తి చూపిందని సమాచారం. దీనిపైన త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరో హీరోయిన్గా అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించనుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కి పదోది కాగా, పూరికి 37 వ సినిమా ..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి విజయ్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories