విజయ్ ...ఫస్ట్ లుక్ కాపీ పోస్టరేనా?

విజయ్ ...ఫస్ట్ లుక్ కాపీ పోస్టరేనా?
x
Highlights

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ... అర్జున్ రెడ్డి , గీతా గోవిందం సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో...

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ... అర్జున్ రెడ్డి , గీతా గోవిందం సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో విజయ్ కి ఫాన్స్ ఫాలోయింగ్ వీపరీతంగా పెరిగిపోయింది. ఇటు విజయ్ కూడా తన సినిమాలను కూడా పక్కా భాషలో విడుదల చేస్తూ తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు . ఈ క్రమంలో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 'క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్' బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . ఈ సినిమాలోని విజయ్ లుక్ కాపీ అని సోషల్ మీడియాలో ఓ వార్త హల చల్ చేస్తుంది . "చార్లెస్ అజ్నవౌర్ -ల బొహేమి (భౌభౌ రీమిక్స్ )" అంటూ యూట్యూబ్ లో ఒక సాంగ్ ఉంది. అందులోని ఓ పోస్టర్ లో ఉండే హీరో లుక్ సేమ్ విజయ్ లుక్ లాగే ఉండడంతో విజయ్ కొత్త లుక్ కాపీ అని ప్రచారం నడుస్తుంది. మరి దీనిపైన చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories