కామ్రేడ్స్ డియర్ కామ్రేడ్ వచ్చేస్తున్నాడు..

కామ్రేడ్స్ డియర్ కామ్రేడ్ వచ్చేస్తున్నాడు..
x
Highlights

విజయ్ దేవరకొండ సినిమా అంటే అదోరకమైన క్రేజ్. యువతలో అద్భుత ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇపుడు డియర్ కామ్రేడ్ అంటూ అందర్నీ పలకరించబోతున్నాడు. తెలుగుతో పాటు...

విజయ్ దేవరకొండ సినిమా అంటే అదోరకమైన క్రేజ్. యువతలో అద్భుత ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇపుడు డియర్ కామ్రేడ్ అంటూ అందర్నీ పలకరించబోతున్నాడు. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతున్న డియర్ కామ్రేడ్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. సినిమాకి సంబంధించిన టీజర్లు, పాటలు విడుదలై సినిమా మీద అంచనాల్ని విపరీతంగా పెంచేశాయి. ఇపుడు సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 11 వ తేదీ.. గురువారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కామ్రేడ్స్ సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories