Vijay Devarakonda సినిమాకి హిందీ ప్రేక్షకులు ఫిదా

Vijay Devarakonda సినిమాకి హిందీ ప్రేక్షకులు ఫిదా
x
Highlights

యూత్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ హీరో ఆ తర్వాత...

యూత్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ హీరో ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఇక విజయ్ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.. అయిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో డబ్ చేసుకొని మరి చూసారు.

బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయకపోయినా విజయ్ కి మాత్రం అక్కడ మంచి క్రేజ్ అయితే ఉంది. ఈ నేపధ్యంలో గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ 'డియర్ కామ్రేడ్' హిందీ అనువాద హక్కులను కొనుగోలు చేసి ఈనెల 19న తమ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. యూట్యూబ్ లో విడుద‌ల అయిన 24 గంట‌ల్లోనే 11 మిలియ‌న్ల వ్యూస్ ను సాధించింది. ఈ సినిమా తమని బాగా ఆకట్టుకుందని కింద కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో విజ‌య్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. భరత్ కమ్మా దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలిజై ఆకట్టుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్ ' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్స్ నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు విజయ్ .. ఈ సినిమాని నిన్న ముంబైలో పూజా కార్యక్రమాలుతో మొదలైంది. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా చేతులు కలపనున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories