వేణుమాధవ్ మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

వేణుమాధవ్ మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
x
Highlights

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్ ఈరోజు ( బుధవారం) కన్నుమూశారు. అయన మరణం పట్ల సినీ పరిశ్రమ...

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్ ఈరోజు ( బుధవారం) కన్నుమూశారు. అయన మరణం పట్ల సినీ పరిశ్రమ సంతాపం తెలుపుతుంది. తెలుగు పరిశ్రమ మంచి నటుడుని కోల్పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. పలువురు సినీ రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడంతో ఆయనకి మిమిక్రి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు లభించింది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన "సంప్రదాయం" సినిమాతో వేణుమాధవ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది అన్న దానిపై ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వేణుమాధవ్ స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చారు " రచయిత దివాకర్ బాబు కి సన్మాన కార్యక్రమం ఉంటే దానికి నన్ను పిలిచారు. అ సన్మాన కార్యక్రమంలో నేను చేసిన హాస్యం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డికి బాగా నచ్చింది. దీనితో సినిమాల్లో నటించాలని ఆఫీస్ కి పిలిచారు. 35 రోజుల షూటింగ్ లో పాల్గొనలని వారు అడిగారు. నేను అక్కడి నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. రోజుకు రెండు వెయిలు ఇస్తే చేస్తానని చెప్పాను. అప్పుడు వారు సంతోషంగా డెబ్బై వెల రూపాయలు ఇచ్చారు. అలా నా మొదటి సినిమాకి రెమ్యునిరేషన్ ఇంతా తీసుకున్నానని" వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.

ఆ సినిమా తర్వాత వేణుమాధవ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశలు ఆయనని స్టార్ కమెడియన్ ని చేసాయి. దీనితో మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డిలకి కృతజ్ఞతగా అయన ఇంటికి "అచ్చి" వచ్చిన "కృష్ణ" నిలయం అని పేరు పెట్టుకోనని వేణుమాధవ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories