వెంకటేష్ పుట్టనరోజుకు వెంకీమామ?

venkymama
x
venkymama
Highlights

అయితే ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజు(డిసెంబర్ 13) సందర్భంగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మామ .. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ సినిమాని నిర్మిస్తుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, సినిమా సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి.

అయితే ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజు(డిసెంబర్ 13) సందర్భంగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాని సంక్రాంతికే విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. కానీ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు లైన్ లో ఉండడంతో సినిమాని డిసెంబర్ లోనే విడుదల చేయాలనీ భావిస్తున్నట్టు సమాచారం..దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

జై లవ కుశ సినిమా తర్వాత బాబీ చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాని తీస్తున్నారు. ఇక f2 సినిమా తర్వాత వెంకటేష్ చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories