వెంకీమామ ఫస్ట్ డే కలెక్షన్స్

వెంకీమామ ఫస్ట్ డే కలెక్షన్స్
x
Highlights

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ వెంకీమామ. రియల్‌ లైఫ్‌

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ వెంకీమామ. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు, రీల్‌ లైఫ్‌లోనూ అదే పాత్రల్లో నటించటంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే సినిమాను కూడా భారీగా రిలీజ్ చేశారు. నిన్న ( శుక్రవారం ) విడుదలైన ఈ సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వస్తుంది. స్క్రీన్ పైన మామ అల్లుళ్ళ జోడి అదిరిందని అంటున్నారు.

కథ రొటీన్ అయినప్పటికి సినిమాలో కామెడీ, సెంటిమెంట్‌ బాగా వర్క్‌ అవుట్‌ కావటంతో సినిమాకి రీపీట్ ఆడియన్స్ వస్తున్నారని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే వసూళ్లు కూడా భారీగా ఉంటాయన్న టాక్‌ వినిపిస్తోంది. తొలి రోజు రికార్డ్ వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. అధికారిక లెక్కలు వెలువడకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 6.5 కోట్ల వరకు గ్రాస్‌ సాధించినట్టుగా లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. వరల్డ్‌ వైడ్‌ గ్రాస్‌ 8 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

తొలిరోజే మంచి కలెక్షన్లను సాధించిన వెంకీమామ ఇప్పుడు వీకెండ్ కావడంతో మరిన్ని కలెక్షన్లను సాధించడం పక్కా అని చెబుతున్నాయి ట్రెండ్ వర్గాలు. ఈ సినిమా దాదాపుగా 34 కోట్ల బిజినెస్‌ జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా 34 కోట్ల వసూళ్లు సాధిస్తే గాని బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న ఊపులో ఈ టార్గెట్‌ను వెంకీ మామ రీచ్‌ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది.

మామ అల్లుళ్ళ మధ్య ఉన్న అనుబంధంతో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీకి జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నాలు నటించారు. బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వం వహించారు. ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్‌ బాబు నిర్మించాడు. తమన్ సంగీతం అందిచాడు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ తమిళ్ లో మంచి హిట్టు అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories