ముందుగా వెంకీమామ కథ నాకు నచ్చలేదు కానీ

ముందుగా వెంకీమామ కథ నాకు నచ్చలేదు కానీ
x
కే. యస్ రవీంద్ర (బాబీ)
Highlights

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్నా చిత్రం 'వెంకీమామ'.. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కానుంది.

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య నటిస్తున్నా చిత్రం 'వెంకీమామ'.. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కానుంది. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తమన్ సంగీతం అందించాడు. బాబీ( కే. యస్ రవీంద్ర ) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బాబీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. " ముందుగా ఈ ప్రాజెక్ట్ లోకి నేను అనుకోకుండా వచ్చాను. జై లవ కుశ సినిమా తర్వాత నేను ఓ స్టార్ హీరోతో సినిమాని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రచయిత కోన వెంకట్ సురేష్ బాబు దగ్గర ఓ కథ ఉందని, అది వినమని సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ అయ్యాను. సురేష్ బాబు ఈ అవకాశాన్ని ఇచ్చారు.

కథ విన్నాక నాకు నచ్చేలేదు. ఎలా చెప్పాలో తెలియక కొద్ది రోజులు టైం కావాలని కోరాను. ఆ తర్వాత కథ గురించి మళ్ళీ సురేష్ బాబు బాబు ఫోన్ చేయడంతో వెళ్లి కథ నచ్చలేదని చెప్పాను. అయనకి నా మీదా ఉన్న నమ్మకంతో కథలో మార్పులు చేసి తీసుకురమ్మన్నారు. అలా చేసిన మార్పులు సురేష్ బాబుకి బాగా నచ్చడంతో సినిమాని పట్టలేక్కించాం. " అని బాబీ చెప్పుకొచ్చారు.

మామఅల్లుళ్ళ నేపధ్యంలో ఈ సినిమా తెరక్కుతుంది. ఇందులో వెంకటేష్ మిలిటరీ నాయడుగా కనిపిస్తే, నాగ చైతన్య ఆర్మీ లుక్ లో కనిపిస్తున్నాడు. భారీ అంచనాల నేపధ్యంలో ఈ సినిమా డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories