ఆ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉంది: వెంకటేష్

ఆ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉంది: వెంకటేష్
x
వెంకటేష్
Highlights

తెలుగులో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మల్టీస్టారర్ సినిమా అంటే అందులో దర్శక నిర్మాతలకి హీరో వెంకటేష్ ఓ ఆప్షన్ అయిపోయాడు.

తెలుగులో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మల్టీస్టారర్ సినిమా అంటే అందులో దర్శక నిర్మాతలకి హీరో వెంకటేష్ ఓ ఆప్షన్ అయిపోయాడు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, కమల్ హసన్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు వెంకటేష్. తన సినిమాలో స్క్రీన్ ని షేర్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. కానీ వెంకటేష్ యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మిగతా హీరోలకి ఇన్స్పైర్ గా నిలిస్తున్నాడు.

మొదటినుంచి విభిన్నమైన సినిమాలతో మెప్పిస్తున్నాడు వెంకటేష్. అప్పుడప్పుడు రీమేక్ సినిమాలతో కూడా అలరిస్తూ వరుస హిట్లు కొడుతున్నాడు. ఏకంగా విక్టరినే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెంకటేష్. తన ౩౩ ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

అసలు తనకి సినిమాల్లోకి వస్తానని అనుకోలేదని, కానీ వచ్చాక మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశానని, దర్శక నిర్మాతలు కూడా నన్ను నమ్మి మంచి మంచి కథలతో వచ్చారని అన్నాడు. అయితే గత ఐదేళ్ల నుండి సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకుంటున్నాను కానీ కావడం లేదని అన్నారు. ఒకప్పుడు వివేకానంద రోల్ చేయాలని ఉండేదని, కానీ అలాంటి కథలు రావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పడున్న యంగ్ హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్ లతో కలిసి మల్టీస్టారర్ చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ఇక హీరో నానితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి ఉంది కానీ అది మిస్ అయిందని త్వరలోనే చేస్తామని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం వెంకటేష్ నటించిన వెంకీమామ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ చైతన్య మరో హీరోగా నటించాడు. రియల్ లైఫ్ లో మామ అల్లుళ్ళు అయిన వెంకీ, చైతూ రీల్ లైఫ్ లో కూడా నిజజీవిత పాత్రలు పోషించడంతో సినిమాపైన మంచి హైప్ క్రియేట్ అయింది. విడుదలైన అన్ని సెంటర్లలో సినిమాకి మంచి స్పందన వస్తుంది.

ఈ సినిమా తర్వాత వెంకటేష్ తమిళ్ లో మంచి హిట్టు అయిన అసురన్ సినిమాని చేయనున్నాడు. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే సమ్మర్ లో సినిమాని విడుదల చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories