అల్లుడు చింపేశాడమ్మా ఇంకేం కావాలి ఈ మామకి

అల్లుడు చింపేశాడమ్మా ఇంకేం కావాలి ఈ మామకి
x
venkatesh
Highlights

విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీమామ.. రీయల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ కూడా వీరిద్దరూ మామ అల్లుళ్ళుగా నటించడంతో...

విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం వెంకీమామ.. రీయల్ లైఫ్ లోనే కాదు రీల్ లైఫ్ కూడా వీరిద్దరూ మామ అల్లుళ్ళుగా నటించడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాని డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ట్రైలర్ ని విడుదల చేసింది.

ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ సినిమా అద్బుతంగా వచ్చిందని, నాగ చైతన్య చాలా అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చాడు. అల్లుడు చింపేశాడమ్మా ఇంకేం కావాలి ఈ మామకి అంటూ వెంకటేష్ వాఖ్యానించారు. దర్శకుడు బాబీ చాలా చక్కగా మామ అల్లుళ్ళు మధ్య రిలేషన్ ని చక్కగా చూపించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మాత్రమే నేను చైతూ కి మామని కానీ సినిమా విడుదలయ్యాక మీ అందరికి మామనే అని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఉత్సాహంగా మాట్లాడారు వెంకీ..

ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. తమన్ సంగీతం అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories