సైరా చూసి మనం నేర్చుకోవాల్సిందే అదే.. తమన్నా పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు..

సైరా చూసి మనం నేర్చుకోవాల్సిందే అదే.. తమన్నా పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు..
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సైరా దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో...

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సైరా దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో మెగాస్టార్ ప్రముఖ రాజకీయ నేతలతో వరుసగా భేటి అవుతూ వస్తున్నారు. సినిమాని చూడాలని కోరుతున్నారు. అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ ని కలిసారు చిరంజీవి. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసారు ..

వెంకయ్యనాయుడు కోసం సైరా స్పెషల్ షో వేసారు. చిరంజీవితో కలిసి సినిమాని వీక్షించిన వెంకయ్య అనంతరం మీడియాతో ముచ్చటించారు. సైరా చిత్రం బాగుందని, చిరంజీవి చాలా అద్భుతంగా నటించారని కొనియాడారు. ఈ సినిమాలో అద్భుతమైన మెసేజ్ ఉందని అన్నారు. మనలో మనకి పడకపోవడం, ఐకమత్యం లోపించడం వల్లే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు. ఆ అంశాలని సైరాలో చాలా చక్కగా చూపించారని వెంకయ్య కొనియాడారు.

అనంతరం హీరోయిన్ తమన్నా గురించి మాట్లాడిన వెంకయ్య సైరా చిత్రంలో ఆ అమ్మాయి వీరవనితగా అద్భుతంగా నటించిందని అన్నారు. గతంలోకూడా తమన్నాని నేను చూశానని అన్నారు. నయనతార కూడా చాలా బాగా నటించిదని అన్నారు. సైరా సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకేక్కించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories