అల్లుడితో వెంకీమామ వచ్చేది అప్పుడే!

అల్లుడితో వెంకీమామ వచ్చేది అప్పుడే!
x
venkymama
Highlights

మొత్తానికి ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజున ( డిసెంబర్ 13) న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ

రియల్ లైఫ్ లో వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళు అన్న సంగతి తెలిసిందే.. వీరిని రీల్ లైఫ్ లో కూడా చూడాలని అనుకోని అభిమాని బహుశా ఉండడేమో.. లక్కిగా ఇద్దరు స్క్రీన్ పైన కూడా మామ అల్లుళ్ళుగానే కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న ప్రశ్న గత కొంతకాలంగా అందరిని వెంటాడుతుంది. మొత్తానికి ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజున ( డిసెంబర్ 13) న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించింది చిత్రబృందం.

ఇందులో నాగచైతన్య సరసన రాశీఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నాయి. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవ కుశ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబీ ఈ సినిమా చేయడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు f2, మజీలీ లాంటి మంచి హిట్ల తర్వాత వెంకటేష్, నాగ చైతన్య చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మరిన్ని అంచనాలు పెరిగాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories