అప్పుడే పది కథలు వినేసాడట..!

varun sandesh
x
varun sandesh
Highlights

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన వైఫ్ వితికతో కలిసి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చివరివరకు ఉండి,

హీరో వరుణ్ సందేశ్ నుండి సినిమాలు లేకా చాలా రోజులు అవుతుంది. హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్టు కొట్టి వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఇక 2015లో వచ్చిన లవకుశ సినిమాలో చివరగా కనిపించాడు వరుణ్..

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన వైఫ్ వితికతో కలిసి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చివరివరకు ఉండి, నాలుగో స్థానంలో నిలిచి హౌస్ నుండి బయటకు వచ్చేసాడువరుణ్.. అయితే బిగ్ బాస్ 3 తర్వాత వరుణ్ కి చాలా అవకాశలు వస్తున్నాయట.. ఈ గ్యాప్ లోనే పది కథలు విన్నాడట.. అందులో ఓ మల్టీ స్టారర్ సినిమాకి ఒకే చెప్పాడట.. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుందట.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ చెప్పుకొచ్చాడు. ఇదే కాకుండా మరో లవ్ స్టొరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. వరంగల్ బ్యాక్ గ్రాప్ లో ఈ సినిమా నడుస్తుందట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories