విశాల్ పెళ్లి.. వరలక్ష్మి ఆగ్రహం..

విశాల్ పెళ్లి.. వరలక్ష్మి ఆగ్రహం..
x
Highlights

హీరో విశాల్ పెళ్లి హైదరాబాద్ కు చెందిన అనీషాతో జరగనుందని ఇటీవల్ విశాల్ తండ్రి కృష్ణారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి లోపు...

హీరో విశాల్ పెళ్లి హైదరాబాద్ కు చెందిన అనీషాతో జరగనుందని ఇటీవల్ విశాల్ తండ్రి కృష్ణారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి లోపు నిశ్చితార్ధర్ధానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో విశాల్ అభిమానులు ఆనందంలో ఉంటే విశాల్ చిరకాల స్నేహితురాలు వరలక్ష్మి మాత్రం మండిపడుతోంది. అయితే అది విశాల్ మీద కాదులెండి.. సామజిక మాధ్యమాల్లో వరలక్ష్మిని ట్రోల్ చేస్తున్న వారిపై.. విశాల్‌కు అమ్మాయి సెట్‌ కావడంతో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కూడా త్వరలో పెళ్లికి సిద్ధం అవుతోందని, వివాహానంతరం నటనకు గుడ్‌బై చెప్పనుందని గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రూమర్ చక్కర్లు కొడుతోంది.

దాంతో ఈ రూమర్ పై నటి వరలక్ష్మి కాస్తా ఘాటుగానే స్పందించింది. ఇంతకుముందు మాదిరిగానే ఈ ఏడాది చివరిలోనూ కొందరు పనీపాటా లేని వారు నా పెళ్లి గురించి మాట్లాడటం మొదలెట్టారు. ప్రస్తుతానికి నేను పెళ్లి చేసుకోవడంలేదు. నేను ఎక్కడికి వెళ్ళాను. ఇక్కడే ఉంటాను. సినిమాల్లో నటిస్తూనే అందరి పని పడతాను. కాబట్టి ప్రియమైన ప్రచారకులారా మీకు బెటర్‌ లక్‌ నెక్ట్స్‌టైమ్‌. ఈ సారి ఇంకా గట్టిగా ప్రయత్నించండి. మీరెవరన్నది నాకు తెలుసు అని వరలక్ష్మి పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories