వకీల్‌ సాబ్‌ టీజర్‌ కి ముహూర్తం ఫిక్స్

వకీల్‌ సాబ్‌ టీజర్‌ కి ముహూర్తం ఫిక్స్
x
Pawan kalyan
Highlights

అజ్ఞాత‌వాసి సినిమా తర్వాత రాజకీయాల వల్ల రెండేళ్ళ విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది.

అజ్ఞాత‌వాసి సినిమా తర్వాత రాజకీయాల వల్ల రెండేళ్ళ విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగానే పవన్ రీఎంట్రీ మూవీగా `వ‌కీల్‌సాబ్‌` తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..

ఈ సినిమాలో పవన్ సరసన అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శేరావేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయగా ఎక్కడలేని రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సినిమా ట్రైలర్ ని ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీ ఆధారంగా ఈ సినిమాని తెరకేకిస్తున్న సంగతి తెలిసిందే..

ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories