వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర‌ గోవింద... మూవీ రివ్యూ

వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర‌ గోవింద... మూవీ రివ్యూ
x
Highlights

హాస్యనటులు హీరోలుగా మారడం అనేది తెలుగు చిత్రపరిశ్రమకి కొత్తేమి కాదు .. రేలంగి నుండి అలీ , సునీల్ , షకలక శంకర్ వరకు అందరు సినిమా హీరోలుగా చేసినవారే ....

హాస్యనటులు హీరోలుగా మారడం అనేది తెలుగు చిత్రపరిశ్రమకి కొత్తేమి కాదు .. రేలంగి నుండి అలీ , సునీల్ , షకలక శంకర్ వరకు అందరు సినిమా హీరోలుగా చేసినవారే . ఇప్పుడు అదే లిస్టు లో చేరిపోయాడు సప్తగిరి .. ఇప్పటికే సప్తగిరి ఎక్స్ ప్రెస్ మరియి సప్తగిరి ఎల్ ఎల్ బీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సప్తగిరి మరో సారి వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర‌ గోవింద అంటూ ప్రేక్షకులను అలరించేందుకు దియేటర్లోకి వచ్చేసాడు .. మరి ఈ సినిమా సప్తగిరికి ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో మన రివ్యూ లో చూద్దాం..

కధ..

సోమల అనే చిన్న గ్రామంలో ఒక్కొక్కరు క్యాన్సర్‌తో చనిపోతుంటారు .. అదే గ్రామవాసి అయిన గోవిందు (సప్తగిరి) తన గ్రామంలో వాళ్ళు పడే కష్టాలు చూడలేకా దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . ఓ నిధిని వెతికేందుకు కొంతమందితో ఒప్పందం చేసుకుంటాడు. ఈ ప్రయత్నంలో వారికి 150 కోట్ల విలువైన మహేంద్ర నీలం అనే వజ్రం దొరుకుతుంది. అయితే వజ్రాన్ని ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టిన గోవింద్‌ ఓ ప్రమాదంలో గతం మర్చిపోతాడు. తిరిగి అతనికి వజ్రం దాచిపెట్టిన ప్లేస్ గోవింద్ కి దొరికిందా లేదా అన్నది మిగిలిన కధ..

విశ్లేషణ..

సహజంగా సప్తగిరి సినిమాలో కధ ఎలా ఉన్న ఓ మంచి మెసేజ్ అయితే కచ్చితంగా ఉంటుంది . సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో పోలిస్ వాళ్ళ గురించి చెప్పిన సప్తగిరి అ తర్వాత సినిమా సప్తగిరి ఎల్ ఎల్ బీలో రైతుల కష్టం గురించి చెప్పారు . ఇప్పుడు ఇందులో కూడా కాన్సర్ భాదితుల గురించి అంతర్లీనంగా చెప్పారు . కధ చెప్పేందుకు బాగానే ఉన్నా దానికి తగ్గటుగా కధనాలు లేవు .. సినిమాలో కామెడికి కొదవలేదు అనే చెప్పాలి . కానీ లాగింగ్ సన్నివేశాలు ఎక్కువ కావడంతో సినిమాని చూసే ప్రేక్షకుడకి కాస్తంత నిరాశే మిగులుతుంది . హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకునేలా కూడా లేవు . పాటలు కూడా బోర్ కొట్టిస్తాయి .. సినిమాలో చాలా లాజిక్ లు మిస్ అయ్యాయి ..

నటినటులు ..

ఎప్పటిలాగే సప్తగిరి తన నటనతో సినిమా మొత్తం ఆకట్టుకున్నాడు . కానీ ఇంకా పోరాట సన్నివేశాల్లో ఇంకా బాగా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది . ఇక హీరోయిన్ వైభవీ జోషికి స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు . పాటల వరకు మాత్రమే పరిమితం అయింది . ఇక ఆర్చన ఒకే అనిపించిది . మిగతా నటి నటులు వారి పాత్రల మేరకు ఒకే అనిపించారు ..

సాంకేతిక వర్గం ..

సినిమాలో సాంకేతిక వర్గ లోపం స్పష్టంగా కనిపిస్తుంది . బల్గానిన్‌ అందించిన సంగీతం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు . నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి .. ఎడిటర్ తన కత్తెరకి పని పెట్టాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి .. ప్రవీణ్ కెమరా వర్క్ ఒకే అనిపించింది ..

చివరగా ..

కామెడి ఒకే కధే లేదు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories