పాన్ ఇండియా మూవీతో వస్తున్న ఉపేంద్ర

పాన్ ఇండియా మూవీతో వస్తున్న ఉపేంద్ర
x
Highlights

విభిన్నమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులలో మంచి నటుడు అనిపించుకున్న హీరో ఉపేంద్ర ..కన్నడ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా కన్యాదానం, రా, టాస్, సన్నాఫ్...

విభిన్నమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులలో మంచి నటుడు అనిపించుకున్న హీరో ఉపేంద్ర ..కన్నడ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా కన్యాదానం, రా, టాస్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలలో నటించి ఇక్కడ కూడా మంచిఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ రియల్ స్టార్.. ఇప్పుడు అయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులలో ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడుతుంది.

ఇప్పుడు 'క‌బ్జ' అనే మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఉపేంద్ర.. 1947-80 మధ్యలో వచ్చిన అండర్ వరల్డ్ డాన్ గా కథాంశంతో తెరకెక్కుతుంది. పాన్ ఇండియ‌న్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రూపొంద‌నుంది. ఈ సినిమా షూటింగ్ నిన్న రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా మూవీలో ఉపేంద్ర లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఆ తర్వాత ఉపేంద్ర పైన సన్నివేశాన్ని చిత్రీకరించారు

ఆర్ .చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొత్తం ఏడూ బాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మొత్తం ఏడుగురు విల‌న్స్ ఉండనున్నారని తెలుస్తుంది. బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌ప్రకాశ్ రెడ్డి , ప్రదీప్ రావ‌త్‌, స‌ముద్రఖ‌నిల‌ని విల‌న్స్‌గా ఎంపిక చేసుకున్నట్టు స‌మాచారం. దీనితో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories