logo

'ఉమేర్ సంధూ' సాహో రివ్యూ ... ప్రభాస్ ని తప్ప మరొకరిని ఉహించుకోలేమట... !

Highlights

దర్శకుడు రాజమౌళితో చేసిన బహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్నా సినిమా అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో...

దర్శకుడు రాజమౌళితో చేసిన బహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్నా సినిమా అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ..అందుకు తగ్గట్టు సాహో నిర్మాణ సంస్థ కూడా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తుంది . ఇక సినిమాలోని ప్రభాస్ లుక్, టిజర్, ట్రైలర్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది . ఈ నేపధ్యంలో సినిమా సెన్సార్ కాపీ చూసిన ఉమేర్ సంధూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు .

" సాహోలో ప్రభాస్ ఎంట్రీనే ఓ అద్భుతం. సినిమా మొదటి భాగంలోని యాక్షన్ సీన్స్ , చేజింగ్ సీన్స్ ప్రేక్షకుల మతి పోగోడుతుందని అయన ట్వీట్ చేసారు . అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ బాగుందని , సినిమాలో ప్రభాస్ ని తప్ప మరొకరిని ఉహించుకోలేమని అయన చెప్పుకొచ్చారు . ఇక మొత్తానికి సాహో సినిమా బ్లాక్ బస్టర్ అని . సాహో గత సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఖాయమని అయన ట్వీట్ చేసారు .




లైవ్ టీవి


Share it
Top