ఆరేళ్లైనా మర్చిపోలేని ఉదయ కిరణం

ఆరేళ్లైనా మర్చిపోలేని ఉదయ కిరణం
x
Uday kiran (File Photo)
Highlights

చిత్రం సినిమాతో సినీ కెరియర్ ని మొదలు పెట్టాడు హీరో ఉదయ్ కిరణ్ .. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు.

చిత్రం సినిమాతో సినీ కెరియర్ ని మొదలు పెట్టాడు హీరో ఉదయ్ కిరణ్ .. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత చేసిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు మంచి విజయాన్ని సాధించి ఉదయ్ కిరణ్ ని స్టార్ ని చేసాయి. ఇక నువ్వు నేను సినిమాకి గాను ఏకంగా నంది అవార్డు లభించింది. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకున్న హీరో ఉదయ్ కిరణ్ కావడం విశేషం.. ఇక ఆ తరవాత చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం ఉదయ్ కిరణ్ ని నిరాశాకి గురిచేశాయి.

శ్రీరామ్, హోళీ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇక ఆ తరువాత వచ్చిన నీ స్నేహం పర్వాలేదు అనిపించింది. ఇక 2004 నుంచి ఉదయ్ కిరణ్ చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతూ వచ్చాయి. కొత్త అవకాశాలు రాకా ఉన్న అవకాశాలు కూడా వచ్చి పోతుండడంతో 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అద్భుతమైన జీవితాన్ని ముందు పెట్టుకొని ఉదయ్ జీవితం ఇలా అర్ధాంతంగా ముగిసిపోవడం సగటు అభిమానిని కలిచివేసింది.

ఉదయ్ ప్రేక్షలని వీడి నేటితో ఆరు ఏళ్ళు అవుతుంది. చిత్రంతో కెరీర్ ని మొదలు పెట్టిన ఉదయ్ కి చిత్రం చెప్పిన కథ చివరి సినిమా కావడం గమనార్హం .. చిత్రం సినిమాతో హిట్టు కొట్టి తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఉదయ్ ఆత్మహత్య కూడా అంతే సంచలనాన్ని సృష్టించింది. భౌతికంగా ఉదయ్ మన మధ్య లేనప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికి చిరస్థాయిలో నిలిచిపోతాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories