రెండు ఐటమ్ సాంగ్స్ ?

sarileru neekevvaru
x
sarileru neekevvaru
Highlights

మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాని...

మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ,మహేష్ లుక్స్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి.

అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ని తెరకెక్కించనున్నారు. ఈ సాంగ్ కోసం తమన్నాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఇదే కాకుండా మరో ఐటెమ్ సాంగ్‌ను కూడా తెరకెక్కించనున్నారని వినికిడి.. ఈ సాంగ్ ని నటి కాజల్ తో చేయించనున్నారని తెలుస్తుంది. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. ఈ మధ్యే సినిమాలో ఆమెకి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories