బుల్లితెర అని సంపాదన చిన్నది అనుకునేరు.. హీరోయిన్లను మించిన ఆదాయం వారిది!

బుల్లితెర అని సంపాదన చిన్నది అనుకునేరు.. హీరోయిన్లను మించిన ఆదాయం వారిది!
x
Highlights

సుమ ఇప్పుడు బుల్లితెర లేడీ సూపర్ స్టార్, హీరోయిన్ డేట్లైన పట్టొచ్చు కాని ఈ యాంకర్ డేట్స్ కావాలంటే, కాసులు పోసినా దొరకవు, అనసూయ , ప్రదీప్ మాచిరాజు కూడా...

సుమ ఇప్పుడు బుల్లితెర లేడీ సూపర్ స్టార్, హీరోయిన్ డేట్లైన పట్టొచ్చు కాని ఈ యాంకర్ డేట్స్ కావాలంటే, కాసులు పోసినా దొరకవు, అనసూయ , ప్రదీప్ మాచిరాజు కూడా అంతే వీళ్లు కో అంటే కోట్లు రాలాల్సిందే. యాంకర్ అంటే అలా మెరిసి ఇలా మాయమయ్యే సెలబ్రెటీలంటారు. కాని వీళ్లు మాత్రం స్టార్ హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో పాపులర్ కొన్ని సార్లు అంతకు మించే ఎందుకలా?

టీవీ యాంకర్ అంటే ఇంటర్వూలు చేయటం, టీవీల్లో మెరవటం, సినిమా ఫంక్షన్స్ లో తళుక్కుమనటం అది ఒకప్పుడు, ఇప్పుడు యాంకర్స్ స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. వాళ్ల ఇంటి మీద టాక్స్ రైడ్ జరిగేంత స్టేజ్ కి రేంజ్ కి ఎదిగిపోయారు.

స్టార్ హీరోయిన్ డేట్లైనా దొరకుతాయి కాని, సుమ డేటు దొరకాలంటే 15 రోజుల ముందే అపాంట్ మెంట్ తీసుకోవాలి. స్టార్స్ ని మించిపోయేంతగా జనాల్లో ఫాలోయింగ్, టాప్ హీరో, హీరోయిన్లను మించేంతగా భారీ రెమ్యునరేషన్ సింపుల్ గా చెప్పాలంటే బుల్లి తెరమీద వెలిగి వెండితెర తారలనే మించిపోతోంది. మించిపోయింది.

ఏ అవార్డ్ ఫంక్షన్ లో చూసినా, సుమ లేదంటే అనసూయ, కాదంటే ప్రదీప్ కుదరకపోతే శ్రీముఖి నుంచి, రవి, రష్మి వరకు ఎవరైనా మెరుస్తారు తెలుగు రాష్ట్రాల్లోనే స్టార్ యాంకర్స్ అనేకంటే, బుల్లితెరలేడీ స్టార్స్ అనొచ్చు అందులో లేడీ సూపర్ స్టార్ సుమ.

ఏ టీవీ ఛానల్ లో చూసినా, ఏ సినిమా సెలబ్రేషన్స్ లో చూసినా, అవార్డు ఫంక్షన్ ఇంకేదైనా అంతటా యాంకర్ సుమ తళుక్కులే, తెలుగు యాంకర్స్ లోనే మోస్ట్ బిజీయెస్ట్ హోస్ట్ తనకి హీరోలు, హీరోయిన్లకు ఉన్నంత పాపులారిటీ ఉంది సుమ ఉంటే చాలు అది ఏ షో అయినా చూసేంత ఇయేజ్ తన సొంతం బిగినింగ్ లో చిన్న యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సుమ స్టార్ మహిళతో దశ తిరిగింది.

స్పాంటేనియస్ గా తను విసిరే చమక్కులు, స్టేజ్ మీద ఎవరున్నా లేకున్నా గంటల కొద్ది జనాలను ఎంటర్ టైన్ చేసే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తన సొంతం. స్టార్ మహిళతో పాటు భలే భలే ఛాన్స్ లే, క్యాష్ , కెవ్వు కేక, ఈ జంక‌షన్ లాంటి షోలతో తిరుగులేని యాంకర్ గా మారింది సుమ. అన్వేషిత నుంచి స్వయంవరం వరకు రకరాకాల సీరియల్స్ చేసిన రాని పేరు, హీరోయిన్ గా లేదంటే సినిమాల్లో సైడ్ రోల్స్ వేసినా రాని పేరు, పాపులారిటీ, ఫాలోయింగ్ స్మాల్ స్క్రీన్ మీద సొంతం చేసుకుంది సుమ. కొన్ని సార్లు సుమ డేట్ అడ్జెస్ట్ అయ్యేదానిని బట్టే, సినిమా వాల్లు వాళ్ల ప్రీరిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటరంటే, సుమకున్న పాపులారిటీ అర్ధం చేసుకోవచ్చు అంతెందుకు ఒక్కరోజు సాయంత్రం జరిగే సినిమా ఈవెంట్ కే 4 లక్షలు ప్లస్ జీఎస్టీ అంటూ ఓ ప్రచారం ఉంది, ఒక టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే, సుమ మంథ్లీ ఇన్ కమే భారీ ఎత్తునుంటుందనంటారు.

యాంకర్ అంటే సాలరీ రేంజ్ లేదంటే ఫ్రీలాన్స్ గా నెలకి లక్ష తీసుకుంటారంటేనే ఒకప్పుడు నోరెల్లబెట్టే పరిస్తితి, అలాంటిది అనసూయ ఆడి కార్ మీద ఎన్నో జోకులున్నాయి, ఏడాదికి 3 కోట్ల టాక్స్ కడుతుందనే ప్రచారం ఉంది రీసెంట్ గా జీఎస్టీ అధికారులు ట్యాక్స్ రైట్ చేశారన్న వార్త నెట్ లో సంచలనం అయ్యింది.

ఒకప్పుడు న్యూస్ ప్రెజెంటర్ గా చేసి, తర్వాత ఈటీవీ జబ్బర్ దస్త్ తో ఫోకస్ అయిన యాంకర్ అనసూయ. తన కెరీర్ జబర్ దస్త్ రాకముందు, జబర్ దస్త్ వచ్చాకా అన్నట్టు మారిపోయింది. మల్లెమాల ప్రొడక్షన్ లో వచ్చిన చాలా టాక్ షోలో తనే యాంకర్ గా మెరిసింది. కొంతకాలం భలే ఛాన్సులే, బిందాస్, జాక్ పాట్ ఇలా చాలా షో చేసింది, కాని జబ్బర్ దస్త్ తోనే తన ఫేట్ మారిందనాలి

అనసూయ అంటే టీవీ ప్రేక్షకులే కాదు, యూత్ లో కూడా మాంచి ఫాలోయింగ్ ఉంది, తను కూడా సింగిల్ ఈవెంట్ కి నాలుగైదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ప్రచారం ఉంది, అంతేకాదు రంగస్థలం లో రంగమ్మత్తగా కనిపించినప్పటి నుంచి తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ హీరోయిన్ కున్నంత ఇమేజ్ ని సొంతం చేసకుంది. అనసూయకి హీరోయిన్ల కంటే కూడా యూత్ లో ఓరేంజ్ క్రేజ్ ఉందికాబట్టే, తనుపేరుమీదే సుమతో పాట పాడించి, సాయి ధరమ్ తేజ్ మూవీ విన్నర్ లో ఐటమ్ సాంగ్ పెట్టారంటే, అనసూయకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

ప్రదీప్ మాచిరాజు బుల్లి తెరమీద చిన్న యాంకర్ గా కెరీర్ మొదలైంది కాని చూస్తుంటే, యాంకర్ నుంచి స్టార్ రేంజ్ కి తను ఎదిగిపోయాడు. తన చిన్న కేసు విషయంలో కూడా ఓ స్టార్ గురించి చర్చించుకున్నంతగా జనం చర్చించుకున్నారంటే, జనాల్లో తనకి ఏ స్థాయి పాపులారిటీ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రదీప్ మాచిరాజు నిజానికి గడసరి అత్త సొగసరి కోడలంటూ ఒక్క షోతో షోకస్ అయ్యాడు, తర్వాత ఈవెంట్లు, ఢీ ఇలా ఒక్కో షోతో పబ్లిక్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన నవ్వుకి, మాటకి టిక్ టాక్ లో స్పూఫ్ ల కొదువేలేదు ఆ ఇమేజ్ తోనే కొంచెం టచ్ లో ఉంటే చెబుతానంటూ ప్రోగ్రామ్ చేసి కో అంటే కోట్లు అనేంతగా కరోడ్ పతి అయ్యాడనంటారు ఏడాదికి 7 కోట్ల ట్యాక్స్ కడుతాడనేంతగా ప్రచారం కూడా జరుగుతోంది.

ప్రదీప్ మాచిరాజుని యాంకర్ సుమకి మేల్ వర్షన్ అంటారు, సుమ తర్వాత అంతా స్పాంటేనిటీ, ఎంటర్ టైనర్ గా తనకి పేరుంది, అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ లవ్, జులాయ్, అత్తారింటికి దారేది లో స్పెషల్ రోల్స్ వేసి అలా కూడా జనాలకు దగ్గరయ్యాడు. పాపులర్ యాక్టర్ గా, స్టార్ యాంకర్ గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు

యాంకర్ రష్మి ఆల్ మోస్ట్ హీరోయిన్ లాంటి హోస్ట్, తను కూడా జబ్బర్ దస్థ్ లో అనసూయ బయటికెల్లినప్పుడు తన ప్లేస్ లో వచ్చి ఫోకస్ అయ్యింది. తర్వాత అనసూయతో కలిసి జబ్బర్ దస్థ్, ఎక్స్ ట్రా జబ్బర్ దస్త్ హోస్ట్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. తెలుగు యాంకర్స్ లో సుమ, అనసూయ, ప్రదీప్ తర్వాత స్థానంలో ఉంది రష్మి, రవి, శ్రీముఖిలే వీళ్లు ఆల్ మోస్ట్ మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ లోనే తల ఓ షోతో జనాల్లో పాపులారిటీ, రెమ్యూనరేషన్ తో స్టేటస్ ని సొంతం చేసుకున్న యాంకర్స్.

రష్మి అయితే సినిమాల్లో నటిగా కెరీర్ మొదలు పెట్టినా, జబ్బర్ దస్త్ పుణ్యమాని జనాల్లో పాపులారిటీ తెచ్చుకోగలిగింది. తర్వాత గుంటూరుటాకీస్ లాంటి ప్రయోగాలతో మరింతగా యూత్ లోఫాలోయింగ్ పెంచుకుంది. ఓరకంగా సుధీర్ కూడా రష్మి తో క్రియేట్ అయ్యే గాసిప్స్ పుణ్యమాని, డీషో పుణ్యమాని ఫోకస్ అయిన యాంకర్ కమ్ ఆర్టీస్ట్ అయితే తనకంటే రష్మికే ఎక్కువగా ఇమేజ్ తోపాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా కోట్లకు పడగలెత్తేంతగా సీన్ మారిపోయింది

రష్మి తర్వాత శ్రీముఖికి మరో సుమ, మరో అనసూయ అనేంత పేరొచ్చింది. గ్లామరస్ యాంకర్ గా, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ యాంకర్ గా పటాస్ షోతో ఫోకస్ అయ్యింది. యాడ్స్, సినిమాలతో కూడా జనాల్లోకి దూసుకెళ్లింది. కేవలం పటాస్ షోతోనే ఓరేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకన్న శ్రీముఖి సినిమాల్లో కూడా ప్యార్ లల్ గా కనిపిస్తూ, అటు పేరుని, ఇటు నాలుగురాల్లని వెనకేసుకుంటూ పోయింది. సినిమాల్లో హీరో కి చెల్లి, లేదంటే అక్క, కాదంటే మరో ఇంపార్టెంట్ రోల్స్ వేసి, ఓరకంగా అనసూయలానే యాంకర్ కమ్ ఆర్టిస్ట్ గా ఫోకస్ అయింది శ్రీముఖి.

సుమ, ప్రదీప్, లేదంటే అనసూయ స్థాయిలో కాకపోయినా, మిగిలిన షోలు, ఈవెంట్లు, అప్పడప్పుడు సినిమాలు చేసుకుంటూ హీరోయినల్ కంటే ఎక్కువే సంపాదిస్తోన్న యాంకర్స్ లో, శ్రీముఖి టాప్ పొజీషన్ లోనే ఉంది. శ్రీముఖి సైడ్ రోల్స్ వేసిన సినిమాల్లో హీరోయిన్లు కూడా అలా వచ్చి ఇలా మాయమయ్యారు, కాని తను మాత్రం జనాల్లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, స్టార్ యాంకర్ గా మారిపోయింది.

రష్మి, శ్రీముఖి తర్వాత రవి కూడా తెలుగు యాంకర్స్ లో మోస్ట్ బిజియెస్ట్ యాంకర్, యూత్ లో ఫాలోయింగ్, క్షణం తీరికలేనంతబిజీ గా ఈవెంట్లతో దూసుకెళ్లే రవికూడా కో అంటే కోట్లే. ఓ స్టార్ హీరో ఎంత సంపాదించినా ఏడాదికి ఒక మూవీ మాత్రమే చేయగలడు. కాని స్టార్ యాంకర్స్ నెలకు చేసే ఈవెంట్లు, షోలు, వాటి రెమ్యునరేషన్ చూస్తే, స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories