హైదరాబాద్ లో టీవీనటి అదృశ్యం

హైదరాబాద్ లో టీవీనటి అదృశ్యం
x
Highlights

హైదరాబాద్ లో టీవీ నటి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులుగా టీవీ నటి లలిత ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు...

హైదరాబాద్ లో టీవీ నటి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులుగా టీవీ నటి లలిత ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన లలిత పలు టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఎక్కువగా టీవీ సీరియళ్ళ చిత్రీకరణ హైదరాబాద్ లోనే ఉండటంతో కొన్ని రోజులుగా ఆమె అమీర్ పేట లోని ఓ వసతి గృహం లో ఉంటోంది. అయితే, ఈ నెల 11 నుంచి ఆమె ఫోన్ స్విచాఫ్ లో ఉందనీ, హాస్టల్ లో ఆమె కనిపించలేదనీ లలిత తల్లి, సోదరి ఫిర్యాదు చేశారు. హాస్టల్ వద్ద నుంచి ఓ వ్యక్తి లలితను వారం రోజుల క్రితం తీసుకుపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఆమెను బన్నీ అనే వ్యక్తి తీసుకువేల్లినట్టు లలిత కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories