థమన్ ని ఆడుకుంటున్న సోషల్ మీడియా..

థమన్ ని ఆడుకుంటున్న సోషల్ మీడియా..
x
Highlights

కాపీక్యాట్.. అంటే ఎవరు అంటే మ‌న కుర్ర సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్ అంటున్నారు. సోషల్ మీడియా గత కొన్ని రోజుల నుండి బాగా ఆడేసుకుంటుంది ఇంతకీ సోషల్ మీడియా...

కాపీక్యాట్.. అంటే ఎవరు అంటే మ‌న కుర్ర సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్ అంటున్నారు. సోషల్ మీడియా గత కొన్ని రోజుల నుండి బాగా ఆడేసుకుంటుంది ఇంతకీ సోషల్ మీడియా ఎందుకు థమన్ ని ఆడుకుంటుంది? థమన్ ఏం చేసాడు ? అనే కదా? కింగ్ సినిమాలో ప‌క్క భాష‌ల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇస్తాడు బ్రహ్మానందం. నిజంగా ఇండ‌స్ట్రీలో ఇలాంటివి చూసి చూసి విసుగొచ్చే శీనువైట్ల కింగ్ సినిమాలో ఈ కామెడీ పెట్టేసిన‌ట్లున్నాడు. ఇప్పుడు థ‌మ‌న్ కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో సామజవరగమన పాట విడుద‌లైంది. ఈ పాట‌ను ఎక్కడో విన్నట్లుందే అని విన‌గానే అనుమానాలు మొద‌ల‌య్యాయి. కాసేప‌టి త‌ర్వాత క్లారిటీ వ‌చ్చేసింది. ఈ పాట ఎక్కడో విన‌లేదు వరంగల్ టైమ్స్ అనే యూ ట్యూబ్ ఛానెల్ లో కుర్రాళ్లు సరదాగా చేసుకున్న ఓ పాటను థమన్ ఇప్పుడు తన కోసం కాపీ కొట్టేసాడు అని. ఈ కడలి అలల అంటూ సాగే ఈ పల్లవిని తీసుకొచ్చి తన పాటకు చరణంగా మార్చేసాడు థమన్.

ఈ విషయం తెలిసి ఇప్పుడు థమన్ తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. గతేడాది ఇదే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతలో కూడా పెనివిటి పాటను వీర సినిమాలో నుంచి కాపీ కొట్టాడు. థ‌మ‌న్ కాపీ అప్పుడప్పుడూ పీక్స్ కు చేరిపోతుంటుంది. ఆ మ‌ధ్య డిక్టేట‌ర్ లో గ‌ణేషా పాట‌ను సెల్ఫీ లేలే సాంగ్ లోంచి తీసుకున్నాడు. ఇక‌ శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తులో అను అను ఎక్కడో విన్నట్లే ఉంటుంది. బ్రూస్ లీ లోని కుంగ్ ఫూ కుమారి సాంగ్ ఫ‌టా పోస్టర్ నిక్ లా హీరోలోని ద‌టింగ్ నాచ్ అనే పాట‌కు కాపీ. ఇక ఆగ‌డులోనూ భేల్ పూరీ సాంగ్ ట్యూన్స్ కూడా బ్రూస్ లీ పాట‌ల్లో వినిపిస్తాయి. బాద్షా డైమండ్ గాళ్ సాంగ్ ను కాస్త మార్చేసి బ్రూస్ లీలో రియా చేసేసాడు థ‌మ‌న్. ఏ సినిమా చూసిన ఏమున్నది గ‌ర్వకార‌ణం అన్నట్లు థ‌మ‌న్ ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ పాట ప‌క్క భాష‌ల్లో హిట్టైన సాంగ్స్ ఉండ‌టం కామ‌నైపోయింది. ఆ మ‌ధ్య ప‌వ‌ర్ లో వ‌చ్చిన నాటంకీ రాంబో రాజ్ కుమార్ లోని సాడీ కే ఫాల్ సేకు ఇలా అన్ని కాపీ క్యాట్ లా తయ్యారు అయ్యాడంటు సోషల్ మీడియా బాగానే ఆడుకుంటుంది. మరి తమన్ ఇప్పటికైన మారతాడా లేదా చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories