నేను సోషల్ మీడియా ఎందుకు వాడనంటే!

నేను సోషల్ మీడియా ఎందుకు వాడనంటే!
x
Highlights

సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న రోజులివి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని అలవాటు చేసుకున్నారు. దీనివల్ల మంచి, చెడు

సోషల్ మీడియా రాజ్యం ఏలుతున్న రోజులివి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనిని అలవాటు చేసుకున్నారు. దీనివల్ల మంచి, చెడు రెండు ఉన్నాయి. దానిని వాడడం బట్టి, దానినుండి మనం నేర్చుకున్నదాన్ని బట్టి మంచి చెడులు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇక ఈ సోషల్ మీడియాని ఎక్కువగా సినిమాకి సంబంధించిన వారు ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే వారు తీసే సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్, అభిమానులతో చిట్ చాట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అసలు సోషల్ మీడియానే వాడారట.. తాజాగా అయన దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపుములో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అయన ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ఎందుకు వాడను అన్నదానికి అయన సమాధానం ఇస్తూ .. " నేను సోషల్‌ మీడియా వాడకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నాకు వాడటం రాదు. రెండు బద్ధకం" అంటూ చెప్పుకొచ్చారు. నేను వదిలేసినన్ని సార్లు ఫోన్ ని ఎవరు వదిలేసి ఉండరని, నేను చాలా సార్లు ఫోన్ ని పోగొట్టుకున్నానని, ఈ వయసులో నాకు దాంతో పనేం ఉంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు

సంక్రాంతి పండగ కానుకగా నిన్న (జనవరి 12) అయన దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపుములో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. జయరాం, టబు, సునీల్, నివేతా పెతురాజ్, సుశాంత్, నవదీప్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories