దిశ ఘటన పై త్రివిక్రమ్ ఏమన్నాడంటే ?

దిశ ఘటన పై త్రివిక్రమ్ ఏమన్నాడంటే ?
x
Highlights

హైదరాబాదు శివారులో యువ వైద్యురాలు దిశపై నలుగురు అత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు యావత్ దేశాన్ని మొత్తాన్ని కదిలించింది. ఈ...

హైదరాబాదు శివారులో యువ వైద్యురాలు దిశపై నలుగురు అత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు యావత్ దేశాన్ని మొత్తాన్ని కదిలించింది. ఈ ఘటనలోని ప్రధాన నిందుతులు అయిన నలుగురిని పోలీసులు సీన్ రీ-కనస్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోతున్న నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఈ నేపధ్యంలో ఈ ఘటనపైన టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించాడు.

తాజాగా అయన దర్శకత్వం వహించిన చిత్రం అల వైకుంఠపురములో... అల్లు అర్జున్ హీరోగా నటించాడు. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన త్రివిక్రమ్ ఈ ఘటన పైన స్పందిస్తూ.. " దిశ ఘటన తెలిసిన తర్వాత నేను మామలు మనిషిని కావడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టింది. ముందుగా చాలా భయం వేసింది. ఆడవాళ్ళని గౌరవించాలని మనం చెప్పడం ఏంటి ? అది నేర్పాల్సిన పరిస్థతి ఏంటి? అది మనకి తెలిసి ఉండాలి. అలా గౌరవించాలని చెప్పాల్సి వస్తే అది నీచమైన పరిస్థితి.. ఇక అలాంటివి చెప్పే పరిస్థితి రాకుడని సమాజం త్వరలోనే వస్తుందని నమ్ముదామని" చెప్పుకొచ్చారు త్రివిక్రమ్

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అల వైకుంఠపురములో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. తమన్ సంగీతం అందించాడు. సినిమాకి సంబంధించిన పాటలు ఎంత పెద్ద హిట్టు అయ్యయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టబు, మురళీశర్మ, నవదీప్, సుశాంత్ , నివేతా పెతురాజ్ ,సునీల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి . ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories