క్రేజీ కాంబినేషన్ : నాగచైతన్యతో త్రివిక్రమ్ మూవీ?

క్రేజీ కాంబినేషన్ : నాగచైతన్యతో త్రివిక్రమ్ మూవీ?
x
Highlights

తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టాడు మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ కథానాయకుడుగా

తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టాడు మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ కథానాయకుడుగా తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాని చేయనున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హారిక హాసిని క్రియేషన్స్ పై కే రాధాకృష్ణ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ వాయిదా పడడంతో వచ్చే ఏడాదికి కానీ ఎన్టీఆర్, చరణ్ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. దీనితో ఈ మధ్యలో అఆ తరహ చిన్న సినిమాని చేయాలనీ త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం.. నిజానికి వీరి కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్..

ఈ సినిమాని కూడా హారిక హాసిని క్రియేషన్స్ పై తెరకేక్కిస్తుందని సమాచారం.. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టొరీ " అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో నాగచైతన్య సినిమా ఉంటుందని సమాచారం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories